వరంగల్ స్పోర్ట్స్ : పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలతో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం సందడిగా మారింది. అండర్–19 బాలబాలికలకు వాలీబాల్, బా క్సింగ్, తైక్వాండో, స్మిమ్మింగ్, కరాటే క్రీడాంశాలలో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. నేడు (గురువారం) జేఎన్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–19 బాలబాలికలకు క్రికెట్, రగ్బీ, ఖోఖో, సాఫ్ట్‌బాల్, లాన్‌టెన్నీస్, జిమ్నాస్టిక్స్ క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ ప్రశాంత్, హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మాధవరావు, పీఈటీల సంఘం బాధ్యులు పార్ధసారథి, ప్రభాకర్‌రెడ్డి, సీనియర్ పీడీలు బరుపాటి గోపి, కోట సతీశ్ పాల్గొన్నారు.
వరంగల్‌లో..
వరంగల్ ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్–14,17 బాలబాలికలకు వరంగల్ ఓసిటీ మైదానంలో యో గా, ఫెన్సింగ్ ఎంపికలు నిర్వహించగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్‌లో హాకీ పోటీలు నిర్వహించా రు. ముఖ్య అతిథిగా స్కూల్ ప్రిన్సిపాల్ సరితారెడ్డి హాజరై హాకీ పోటీలు ప్రారంభించారు. ఈ ఎంపికలకు సుమారు 600 మంది క్రీడాకారులు హాజరైన ట్లు ఎస్‌జీఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి పుల్ల అనిల్‌కుమార్ తెలిపారు. పీఈటీల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు మన్యం వెంకటేశ్వర్లు, కార్యదర్శి జలగం రఘువీర్, మానక వెంకటేశం, హాకీ, యోగా, ఫెన్సింగ్ క్రీడల కన్వీనర్లు అన్వర్, రవీందర్, రావీణ, పీఈటీ సుధాకర్, కోచ్‌లు పాల్గొన్నారు.
తరలొచ్చిన క్రీడాకారులు


