హన్మకొండ అర్బన్ : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్‌లో వివిధ విభాగాలు, కేడర్లలో ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా ఈనెల 28న( సోమవారం) చలో కమిషనరేట్ నిర్వహించి సమ్మె నోటీసు అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 12 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పనిచేస్తున్నట్లు జేఏసీ తెలిపింది.
ప్రభుత్వం దృష్టికి సమస్యలు..
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గత, ప్రస్తు త ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉద్యోగులను మరింత ఇబ్బందులకు గురిచేసే చర్యలు తీసుకుంటున్నాయని, దీంతో తమకు పోరుబాట తప్పడం లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటికే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరినీ కలిశామని, ప్రభుత్వం దృష్టికి కూడా సమస్యలు తీసుకెళ్లామన్నారు. అయినా ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే అధికారులకు వినతిపత్రాలు
సోమవారం హైదరాబాద్‌లోని కమిషనరేట్ కార్యాలయం వద్ద చలో కమిషనరేట్ నిర్వహించి కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేయనున్నామని నాయకులు తెలిపారు. జిల్లాల వారీగా సంబంధిత అధికారులకు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించామన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్యోగులు సాధారణ సెలవు కోసం అధికారులకు దరఖాస్తులు సమర్పించారని తెలిపారు.
ఉద్యోగుల భవిష్యత్ కాపాడాలి..
ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో సేవలందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, హక్కులు, భవిష్యత్‌పై స్పష్టత లేకపోవడంతో ఆందోళన నెలకొందని జేఏసీ తెలిపింది. సమస్యలను సకాలంలో పరిష్కరించకపోవడంతో ఉ ద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల భవిష్యత్‌ను ప్రభుత్వం కాపాడాలని, ఏ ళ్ల తరబడి అందిస్తున్న సేవలకు గుర్తింపు, ఉద్యోగ భద్రత, న్యాయమైన హక్కులు కల్పించాలని ఎన్‌హెచ్‌ఎం జేఏసీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
శాంతియుత నిరసనకు కదిలిరావాలి
నేడు నిర్వహించనున్న చలో కమిషనరేట్ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరూ శాంతియుతంగా, క్రమశిక్షణతో పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించేదిలేదు. ఐక్య ఉద్యమాలతో సమస్యలను పరిష్కరించుకుందాం.
– డాక్టర్ మహేందర్‌రావు పుట్ట,
ఎన్‌హెచ్‌ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రాణం తీసిన ఈత సరదా
● మున్నేరు వాగులో పడి యువకుడి మృతి
డోర్నకల్: ఈత సరదా ఒకరిప్రాణం తీసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగులో ఆదివారం ఈతకు వెళ్లి ఓ యువకుడు ప్రా ణం కోల్పోయాడు. ప్రత్యక్ష సాక్షులు, డోర్నకల్ సీఐ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం ప్రాంతంలోని రుద్రంపూర్ ఏరియా తిలక్‌నగర్‌కు చెందిన గడ్డం మధు అలియాస్ బాలరాజు(25) తన మిత్రులు భార్గవ్, రాహుల్, పర్వేష్‌తో క లిసి శనివారం రాత్రి కారులో కారెపల్లి మండలం క మలాపురంలోని తెలిసిన వారి ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయం డోర్నకల్ చేరుకుని సమీపంలోని మున్నేరువాగు వద్దకు వెళ్లారు. మధు ఈత కొ డతానంటూ నీటిలోకి దిగాడు. లోతు ప్రాంతానికి వెళ్లి మునుగుతుండగా సమీపంలోని వారు నీటిలోకి వెళ్లి మధును కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే నీటిలో పూర్తిగా మునిగిపోయాడు. దీంతో మి త్రులు డయల్ 100కు సమాచారం అందించగా సీఐ చంద్రమౌళి, ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మత్స్యకారుడు శ్రీనివాస్ సాయంతో ఫైర్ సిబ్బంది మధు మృతదేహాన్ని బయటకు తీశా రు. మృతుడు మధు భార్య గర్భవతిగా ఉందని స మాచారం.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మ హబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
నేడు చలో కమిషనరేట్
12 నుంచి నిరవధిక సమ్మెలో
ఎన్ హెచ్‌ఎం సిబ్బంది
అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం


