దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా | - | Sakshi
Sakshi News home page

దూరవిద్య పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈనెల 28,30 తేదీల్లో నిర్వహించాల్సిన దూరవిద్య (ఎస్‌డీఎల్‌సీ) పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌ ఆదివారం తెలిపారు. ‘సెట్‌’ నేపథ్యంలో ఆయా పరీక్షలను వాయిదావేశామని చెప్పారు. మిగతా అన్ని పరీక్షలు టైంటేబుల్‌ ప్రకారం యథావిఽధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. వాయిదాపడిన ఆయా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో జీపీ

ఎలక్ట్రీషియన్‌ మృతి

నర్మెట: రోడ్డు ప్రమాదంలో నర్మెట గ్రామ పంచాయతీ (ఎంపీడబ్ల్యూ) ఎలక్ట్రీషియన్‌ గాదెర రత్నం (57) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. నిడిగొండకు చెందిన చేరుపల్లి దేవానందరావు కుమారుడు దినేశ్‌ (మైనర్‌) ఆదివారం తనసోదరితో కలిసి బైక్‌పై చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రత్నం బైక్‌పై మండల కేంద్రానికి వస్తున్నాడు. ఈ సమయంలో రెండు బైక్‌లు ఎదురుగా ఢీకొనడంతో రత్నానికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే జనగామకు తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు కిరణ్‌ ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నైనాల నగేశ్‌ తెలిపారు.

సీఏఎస్‌ ఆర్‌ఎంఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కాశిబుగ్గ: వైద్య విద్యా సంచాలకులు (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) హైదరాబాద్‌ నియంత్రణలో కాకతీయ మెడికల్‌ కాలేజీ(కేఎంసీ)లో నాలుగు సీఏఎస్‌ ఆర్‌ఎంఓ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ మోహన్‌దాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిలో మార్చి 31, 2027 వరకు లేదా అవసరం ముగిసేవరకు, లేదా రెగ్యులర్‌ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఎంపికై న వైద్యులకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్‌ 5న తాత్కాలిక జాబితా ప్రకటన, 6 నుంచి 7 వరకు అభ్యంతరాలు ప్రకటన, స్వీకరణ, అనంతరం ఎంపిక ప్రక్రియ వివరాలను వెబ్‌ సైట్‌లో ప్రకటిస్తామని ఆయన వివరించారు. పూర్తి వివరాలను www.kmcwgl.com. వెబ్‌సైట్‌లో తెలుసుకోవాలని సూచించారు.

రైతు ఆత్మహత్య

బచ్చన్నపేట : ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పెద్ద చిటి దుర్గారెడ్డి (57) వ్యవసాయ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో ఏమైందో తెలియదు కానీ పోచన్నపేట రోడ్డులో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన చుట్టు పక్కల రైతుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా దుర్గారెడ్డి అప్పటికే చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, కూతురు ఉన్నారు. ఎస్సై శ్రీకాంత్‌ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బచ్చన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, దుర్గారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement