ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: వరంగల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్‌– 14, 16, 18, 20 బాలబాలికలు, మెన్‌ అండ్‌ ఉమెన్‌ విభాగాల్లో జరిగిన పోటీల్లో 1,500 మంది క్రీడాకారులు పాల్గొనగా.. 220 ఈవెంట్లు నిర్వహించినట్లు వరంగల్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఊర యుగేంధర్‌రెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో సత్తా చాటే అవకాశం కోసం అథ్లెట్లు వారి ప్రతిభకు పదును పెట్టారు. నువ్వానేనా అన్నట్లు పోటీపడగా 111 పాయింట్లతో భద్రాద్రి కొత్తగూడెం ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది.

బాలికల విభాగం..

అండర్‌–14 విభాగంలో 15 పాయింట్లతో హనుమకొండ అథ్లెట్లు, అండర్‌–16 విభాగంలో 27 పాయింట్లతో హైదరాబాద్‌, అండర్‌–18 విభాగంలో 22 పాయింట్లతో భద్రాద్రి కొత్తగూడెం, అండర్‌–20లో 28 పాయింట్లతో భద్రాద్రి జిల్లా అథ్లెట్లు విజేతలుగా నిలిచారు. కాగా, సీనియర్‌ ఉమెన్‌ కేటగిరీలో 18 పాయింట్లతో ఖమ్మం జిల్లా అథ్లెట్లు విజేత ట్రోఫీని అందుకున్నారు.

బాలుర విభాగం..

అండర్‌–14 విభాగంలో 11 పాయింట్లతో ఆదిలాబాద్‌, అండర్‌–16 విభాగంలో 10 పాయింట్లతో హనుమకొండ, అండర్‌–18లో 20 పాయింట్లతో హైదరాబాద్‌, అండర్‌–20 కేటగిరీలో 36 పాయింట్లతో రంగారెడ్డి, సీనియర్‌ మెన్‌ చాంపియన్‌షిప్‌ను 32 పాయింట్లతో ఖమ్మం ట్రోఫీని అందుకుంది. తెలంగాణ అథ్లెటిక్స్‌ సంఘం రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి హాజరై విజేతలకు ట్రోఫీతోపాటు సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్‌ సంఘం నిర్వహణ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్‌ అథ్లెటిక్స్‌ సంఘం అధ్యక్షుడు పుల్యాల కిషన్‌, వరంగల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ గట్టు మహేశ్‌బాబు, కోచ్‌లు శ్రీమన్నారాయణ, దిమ్మిక నాగరాజు, టెక్నికల్‌ అఫీషియల్స్‌, తదితరులు పాల్గొన్నారు.

ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ భద్రాద్రి కొత్తగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement