సీఎం సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సీఎం సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

తొర్రూరు: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం కార్యాలయ ంలో శుక్రవారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, సంబంధిత అంశాలపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న పలు పనులకు నిధులు పెంచాలని కోరా రు. దానికి సీఎం సానుకూలంగా స్పందించారు.

నేడు జాతీయ

లోక్‌ అదాలత్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతి మురారి శుక్రవారం తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో నాలుగు లోక్‌ అదాలత్‌ బెంచ్‌లు, తొర్రూరులో ఒక లోక్‌ అదాలత్‌ బెంచ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్‌ ఇతర అతిథులతో కలిసి ప్రారంభిస్తారన్నారు. లోక్‌ అదాలత్‌ విజయవంతానికి అందరు సహకరించాలని, కక్షిదారులు సమయానికి హాజరై కేసుల నుంచి విముక్తి పొందాలని కోరారు.

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

నర్సింహులపేట: రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీఏఓ విజయచంద్ర హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పెద్దనాగారం, నర్సింహులపేట, నర్సింహులపేట స్టేజీ, జయపురం గ్రామాల్లోని ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జయపురంలో పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఎరువులతో పాటు ఏమైనా మందుల లింక్‌పెడితే చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. స్టాక్‌ రిజిస్టర్‌, బిల్లుల పుస్తకాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఓ వినయ్‌కుమార్‌, ఏఈఓ కల్యాణి, రైతులు పాల్గొన్నారు.

సబ్‌స్టేషన్‌ పరిశీలన

ఇనుగుర్తి: మండలంలోని చిన్నముప్పారం గ్రామంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను సీఈ గౌతమ్‌ రెడ్డి శుక్రవారం పరిశీంచారు. గ్రామంలో ఎదురవుతున్న లో–ఓల్టేజ్‌ సమస్యపై ఆరా తీశారు. విద్యుత్‌ సరఫరా తీరులో సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డీఈ కృష్ణ, ఏడీఈ అశోక్‌, ఏఈ సాగర్‌, ఎల్‌ఐ లక్‌పతి, ఎల్‌ఎం పరమేశ్‌, ఏఎల్‌ఎం రాజశేఖర్‌ తదితర విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అంగవైకల్యం ప్రతిభకు అడ్డు కాదు

మహబూబాబాద్‌ అర్బన్‌: అంగవైకల్యం ప్రతిభకు అడ్డు కాదని జిల్లా ఇన్‌చార్జ్‌ డీఈఓ మందుల శ్రీరాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక అవసరాల విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాల పిల్లలను ప్రతీ మంగళవారం తప్పనిసరిగా హెల్త్‌సెంటర్‌కు తీసుకురావాలన్నారు. వారి ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ అప్పారావు, ఐఈ కోఆర్డినేటర్‌ వంగ సురేష్‌, జీఈసీఓ గాయత్రి, ఏఎంఓ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ వైద్యరాలు డాక్టర్‌ సౌమ్య, జిల్లా లీగల్‌సెల్‌ అడ్వైజర్‌ రాజ్‌కుమార్‌, ఆర్పీలు అనిల్‌, కపిల్‌, మమత, భిక్షపతి, రామకృష్ణ, ఐఈఆర్పీలు సతీష్‌, రమేష్‌, రవి, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement