పర్యావరణహితంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణహితంగా జరుపుకోవాలి

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

మహబూబాబాద్‌ అర్బన్‌: వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మట్టి గణపయ్య విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్లాస్టర్‌ ఆఫ్‌ ఫారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల జల వనరులు కలుషితమై పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతగా మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి సాయిశ్రీజ, డీపీఆర్వో రాజేందర్‌ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement