మల్బరీ సాగుతో రైతులకు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

మల్బరీ సాగుతో రైతులకు ఆదాయం

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

గంగారం: మల్బరీ సాగుతో రైతులు నికర ఆదాయం పొందవచ్చని సెరీకల్చర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అనసూయ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నా పట్టు– నా అభిమానం 2.0 కార్యక్రమంలో భాగంగా మల్బరీ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనసూయ మాట్లాడుతూ.. రైతులు పంటల మార్పిడి ద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న మల్బరీ సాగు చేపట్టి ఎకరానికి రూ. 2లక్షల ఆదాయం పొందాలన్నారు. క్లస్టర్‌ స్థాయిలో సామూహికంగా మల్బరీ సాగు చేపట్టాలని, దీనికి కోతులు, దొంగల బెడద లేదన్నారు. ఒక సంవత్సరంలో 5 నుంచి 6 పంటలు తీసుకొవచ్చని, ఎక్కువస్థాయిలో ఎరువులు అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి మరియన్న, కేంద్ర స్కిల్స్‌ బోర్డు శాస్త్రవేత్త సురేష్‌, అధికారి రాము, ఐకేపీ ఏపీఎం ఉపేందర్‌, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు ఈసం జ్యోతి, ఆస్పిరేషన్‌ బ్లాక్‌ కోఆర్డినేటర్‌ శ్రీనాఽథ్‌, మండల వ్యవసాయాధికారి వేణు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement