నెహ్రూసెంటర్: వైద్య ఆరోగ్యశాఖలో ఎంఎల్‌హెచ్‌పీ వైద్యుల సర్టిఫికెట్లను ఆ శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. జిల్లాలో రెండేళ్లక్రితం ఎంఎల్‌హెచ్‌పీల రిక్రూట్‌మెంట్ జరిగింది. అయితే అప్పుడు అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రాగా మరోసారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఎంఎల్‌హెచ్‌పీ ఉద్యోగాల భర్తీలో సుమారు 95మందికిపైగా ఉద్యోగాలు సాధించారని, వారందరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు వచ్చాయని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ తెలిపారు. సర్టిఫికెట్ల పట్ల అనుమానం కలిగితే సంబంధిత బోర్డు ద్వారా తెలుసుకుంటామని డీఎంహెచ్‌ఓ వివరించారు. కాగా, గతంలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం పొందిన వారిని విధుల నుంచి తొలగించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే పోస్టు లేకుండానే ఉద్యోగం ఇచ్చిన ఘటనలు ఉన్నాయి.
నియామకంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు


