గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

కాళోజీ ఆశయాలను అనుసరించాలి

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

కలెక్టరేట్‌లో ఘనంగా ప్రజాకవి జయంతి

మహబూబాబాద్‌: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలను ప్రతీ ఒక్కరు అనుసరించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ప్రజాకవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజల జీవనాన్ని, సామాజిక స్పృహను తన కవిత్వంలో ప్రతిబింబించిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. బహుభాషా కోవిదుడిగా కాళోజీ నిలిచారన్నారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

ప్రజాకవి చూపిన మార్గంలో నడవాలి

ఎస్పీ శబరీష్‌

మహబూబాబాద్‌ రూరల్‌: ప్రతీ ఒక్కరు ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆయన చూపిన ప్రజాసేవ మార్గంలో నడవాలని ఎస్పీ శబరీష్‌ పిలుపునిచ్చారు. కాళోజీ నారాయణరావు 110వ జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం) సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాళోజీ నారాయణరావు చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, అన్యాయాలపై నిరంతరం పోరాడిన యోధుడు కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. ఆయన జీవితం నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కాళోజీ తెలంగాణ భాషకు, సాహిత్యానికి చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో అభినందనీయమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement