కొత్త అధికారులు.. పాత సమస్యలు | - | Sakshi
Sakshi News home page

కొత్త అధికారులు.. పాత సమస్యలు

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

సాక్షి, మహబూబాబాద్‌: మానుకోట.. గుడుంబా, బెల్లం వ్యాపారం, కల్తీ మద్యం అమ్మకాలకు చిరునామాగా ఉంటుంది. కాగా, గతంలో పనిచేసిన అధికారులకు జిల్లా పరిస్థితిపై అవగాహన ఉండడంతో ఎక్కడ ఏం జరుగుతుందో పసిగట్టేవారు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్ష్యాలు పూర్తి చేసేవారు. అయితే మూడు నెలల క్రితం కిందిస్థాయి అధికారులు, వారం రోజుల క్రితం జిల్లాలోని మిగిలిన అధికారులందరూ ఒకేసారి బదిలీ అయ్యారు. దీంతో మొత్తం కొత్త అధికారులు వచ్చి విధుల్లో చేరారు. ఈ క్రమంలో జిల్లాలో గుడుంబాను అరికట్టడం, బెల్లం అమ్మకాలను అడ్డుకోవడం వారికి సవాల్‌గా మారింది.

అందరూ ఒకేసారి బదిలీ..

జిల్లాలోని ఎకై ్సజ్‌శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారులంతా ఒకేసారి బదిలీ అయ్యారు. మూ డు నెలల క్రితం జిల్లాలోని 42 మంది కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేసిన కానిస్టేబుళ్లు ఖమ్మం, భూపాలపల్లి, వరంగల్‌ ప్రాంతాలకు బదిలీపై వెళ్లగా.. ఆయా ప్రాంతాల్లో పనిచేసిన వారు ఇక్కడికి వచ్చారు. అదే విధంగా గ్రూప్‌–1 ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్స్‌ ఇచ్చే క్రమంలో అప్పటికే విధుల్లో ఉన్న ఉన్నవారిని బదిలీ చేశారు. దీంతో జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ బదిలీ కాగా భద్రాద్రి కొత్తగూడెం నుంచి కరంచంద్‌ ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడ సర్దుకోకముందే వారం రోజుల క్రితం జిల్లాలోని నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈక్రమంలో జిల్లాపై అవగాహన లేని అధికారులు ఇక్కడికి వచ్చారు.

గుడుంబా, కల్తీ మద్యం కట్టడికి ఆరాటం

గుడుంబా, కల్తీ మద్యం, బెల్లం అమ్మకాలను కట్టడి చేసేందుకు జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు ఆరాటపడుతున్నారు. కొత్తగా అధికారులకు జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన వచ్చేవరకు సమష్టి తనిఖీలు చేసేందుకు ఆశాఖ సిద్ధమైంది. జిల్లా అధికారులు రోజువారీగా చేసే దాడులతోపాటు వారంలో రెండు సార్లు జనరల్‌ రైడ్స్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అసిస్టెంట్‌ కమిషనర్‌, జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌, స్థానిక సీఐ ఇతర అధికారులు నాలుగు వాహనాల్లో తండాలను చుట్టిముట్టి వస్తున్నారు. ఈ దాడులతో మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నా.. వాళ్లు తనిఖీలు వెళ్లే సమాచారం ముందస్తుగా తెలిసిపోతుందని, అందుకోసమే ఆశించిన స్థాయిలో బెల్లం, గుడుంబా పట్టుబడడం లేదనే ప్రచారం జరుగుతోంది. కాగా, జిల్లాకు కొత్తగా వచ్చిన ఎకై ్స జ్‌ అధికారులకు ఇక్కడ పరిస్థితిని చక్కబెట్టడం సవాల్‌గా మారింది.

దాడులు ముమ్మరం చేస్తున్నాం

గుండుబా, నల్లబెల్లం, కల్తీ మద్యం అమ్మకాలను కట్టడి చేసే ందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. వారంలో రెండు రోజులు జనరల్‌ రైడ్‌ చేస్తున్నాం. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానా విధించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో బెల్లం రవాణా, గుడుంబా తయారీకి పాల్పడితే సహించేది లేదు.

– కరంచంద్‌, జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌

ఎకై ్సజ్‌శాఖలో అంతా కొత్త ముఖాలే

గుడుంబా, కల్తీ మద్యం కట్టడికి ఆరాటం

జిల్లా పరిస్థితులపై అవగాహన లేక ఇబ్బందులు

తనిఖీలు చేసినా పట్టుబడని

అక్రమ వ్యాపారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement