సన్న వరి వంగడాల ఆన్‌లైన్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

సన్న వరి వంగడాల ఆన్‌లైన్‌ తప్పనిసరి

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు రకాల సన్న వరి వంగడాల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ నేటి(గురువారం)తో ముగియనుంది. నమోదు చేసిన వివరాలను పౌర సరఫరాల విభాగానికి పంపుతామని, నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రాధాన్యతతో పాటు, క్వింటాకు రూ.500 బోనస్‌ పొందే అర్హత ఉంటుందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు.

విత్తన వివరాల నమోదు..

డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను సంబంధిత డీలర్లే పోర్టల్‌లో నమోదు చేయాలి.

సొంత, ఇతర రైతుల విత్తనాలు..

సొంత విత్తనాలు లేదా తోటి రైతుల నుంచి విత్తనాలు పొంది సాగు చేస్తున్న రైతులు సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

అధికారుల ధ్రువీకరణ..

వ్యవసాయ శాఖ ఏఈఓలు నమోదు ప్రక్రియను పూర్తి చేయగా.. ఏఓలు 100శాతం వివరాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. కాగా, నమోదు, ధుృవీకరణ ప్రక్రియ అంతా నేటితో పూర్తి కావాలి.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి

అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని కోల్పోకుండా గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాం. సన్న వరి వంగ డాలు సాగు చేసిన రైతులందరూ వెంటనే తమ వివరాలు నమోదు చేయించుకోవాలి.

– ఎస్‌.విజయచంద్ర, డీఏఓ

వరి వంగడాలు ఆన్‌లైన్‌ చేసే విధాన చిత్రం

నేటితో ముగియనున్న గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement