బోనమెత్తిన అమ్మాపురం | - | Sakshi
Sakshi News home page

బోనమెత్తిన అమ్మాపురం

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

తల్లీ.. చల్లంగ చూడు అంటూ..తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.. శ్రావణమాసం నేపథ్యంలో బుధవారం గ్రామంలో డప్పు చప్పుళ్లు, కోలాటాల నడుమ మహిళలు బోనాలతో బయల్దేరి వెళ్లి ముత్యాలమ్మకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.

– తొర్రూరు రూరల్‌

జ్వరంతో నాలుగేళ్ల బాలుడి మృతి

కేసముద్రం: జ్వరంతో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన కేసముద్రం మండలం కల్వల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ ముప్ప శ్రీకాంత్‌, ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు నయాన్ష్‌(4)కు వారం రోజుల క్రితం జ్వరం సోకింది. ఈ నెల 17న మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఆ బాలుడిని ఇంటికి తీసుకొచ్చారు. మరుసటి రోజు మళ్లీ జ్వరం పెరగడంతోపాటు ఫిట్స్‌ రావడంతో మంగళవారం (ఈనెల 18న) ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మరో 15రోజుల్లో బాలుడు నయాన్ష్‌ పుట్టినరోజు ఉండడంతో అదితలచుకుని తల్లిదండ్రులు రోదించిన తీరు అందర్ని కలచివేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement