‘సర్‌’ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

మహబూబాబాద్‌: సర్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 17న విడుదలైన డ్రాప్ట్‌ ఓటర్‌ జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ముసాయిదా జాబితాపై వచ్చే అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. మ్యాపింగ్‌ కాని ఓటర్లు, అనామలీస్‌ గుర్తించిన వారికి నోటీస్‌లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. డ్రాప్ట్‌ ఓటరు జాబితాపై అందే ప్రతీ క్‌లైయిమ్‌ అభ్యంతరాన్ని గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టామన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరు హక్కును పరిరక్షించేందుకు అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్లు వివరించారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement