పేద విద్యార్థులకు అండగా కేజీబీవీలు | - | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు అండగా కేజీబీవీలు

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

డీఐఈఓ మదార్‌గౌడ్‌

తొర్రూరు: అనాథలు, నిరుపేద విద్యార్థులకు అండగా కస్తూర్బా పాఠశాలలు నిలుస్తున్నాయని డీఐఈఓ మదార్‌గౌడ్‌ అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను బుధవారం డీఐఈఓ సందర్శించారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి బోధనపై ఆరా తీశారు. అనంతరం డీఐఈఓ మాట్లాడుతూ.. పదో తరగతి పూర్తయ్యాక విద్యార్థులు స్థిరపడాలనే ఉదేఉ్దశంతో ప్రభుత్వం కస్తూర్బాల్లో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుతో నర్సింగ్‌ రంగంలో రాణించవచ్చని, మంచి ఆస్పత్రుల్లో స్థిరపడవచ్చన్నారు. విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓ శైలజ, అధ్యాపకులు ప్రియాంక, శరణ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement