మహబూబాబాద్ రూరల్ : కక్షతో ఓ ఇంటికి నిప్పంటించడంతోపాటు ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశా రు. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాషిపంగు రామకృష్ణ, అదే గ్రామానికి చెందిన కత్తుల రాజుకు ఇటీవల వాగ్వాదం జరిగి అదికాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో కక్షను మనసులో పెట్టుకున్న కత్తుల రాజు మంగళవారం అర్ధరాత్రి రామకృష్ణ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతోపాటు బైక్‌ను దగ్ధం చేశాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంట్లో ఉన్న కలప, రేకుల షెడ్డు, మంచం, నాలుగు కుర్చీలు, తలుపులు, దర్వాజ, కరెంట్ మీటర్ బోర్డు, దుస్తులు, విలువైన సామగ్రి దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై పిల్లల రాజు తెలిపారు.
రూ.2 లక్షల విలువైన ఆస్తి నష్టం
కంబాలపల్లిలో ఘటన


