వరంగల్ చౌరస్తా : భార్యను హత్య చేసిన కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఓ నిందితుడిని బుధవారం ఇంతెజార్‌గంజ్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఇంతెజార్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ షుకూరు కథనం ప్రకారం.. వరంగల్ నగరానికి చెందిన కుమ్మరి సుధాకర్ అలియాస్ నాని 2023లో తన భార్యను హత్య చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చారు. 2024 నవంబర్ నుంచి విచారణ జరుగుతున్న న్యాయస్థానం ఎదుట హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో నిందుతుడిపై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయగా, పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.


