పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Aug 20 2026 3:46 AM | Updated on Aug 20 2026 3:46 AM

కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి

కేయూ క్యాంపస్‌: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి క్యాంపస్‌ను హరిత ప్రాంగణంగా తీర్చిదిద్దాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి కోరారు. కేయూ గోల్డెన్‌ జూబ్లీ, 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అవెన్యూ ప్లాంటేషన్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. క్యాంపస్‌లోని పరిపాలనభవనం సమీపంలోని స్థలంలో రిజిస్ట్రార్‌ వి. రామచంద్రం, హనుమకొండ జిల్లా అటవీశాఖ అధికారి ముకుందర్‌ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. వీసీ మాట్లాడుతూ డీఎఫ్‌ఓ వివిధ రకాల మొక్కలు అందించారని, వాటిని క్యాంపస్‌లోని అన్ని విభాగాల్లో నాటుతున్నామన్నారు. డీఎఫ్‌ఓ ముకుందర్‌రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీలో ఖాళీ స్థలంలో గార్డెన్లు ఏర్పాటు చేసుకోవచ్చని, అందుకు సహకారం అందిస్తామన్నారు. కేయూ అవెన్యూ ప్లాంటేషన్‌ ఇన్‌చార్జ్‌ బి. వెంకట్‌గోపినాథ్‌, ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు బి. సురేశ్‌లాల్‌, అనితారెడ్డి, పి. సుధాకర్‌, మల్లం నవీన్‌, రమ, చిర్రరాజు, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్‌, సీడీసీ డీన్‌ వరలక్ష్మి,కెహబ్‌ డైరెక్టర్‌ సవితాజ్యోత్న్స, కేయూ ఎన్‌జీఓ అధ్యక్షుడు బూర నవీన్‌, జనరల్‌ సెక్రటరీ వల్లాల తిరుపతి మొక్కలు నాటారు. కాగా, ఈమెగా ప్లాంటేషన్‌లో సుమారు 600 మొక్కలు నాటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement