ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెట్టిన మోదీ | - | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రయోజనాలను తాకట్టుపెట్టిన మోదీ

Aug 11 2026 1:18 AM | Updated on Aug 11 2026 1:18 AM

నెహ్రూసెంటర్‌: దేశ ప్రజల ప్రయోజనాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు, అమెరికాకు తాకట్టుపెట్టిందని ఎస్‌కేఎం నాయకులు ఆరోపించారు. వ్యవసాయరంగాన్ని, రైతాంగానికి నష్టం చేకూర్చే స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని జిల్లా కేంద్రంలో సోమవారం ఎస్‌కేఎం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌కేఎం జిల్లా కన్వీనర్‌ గుజ్జు దేవేందర్‌, ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి గౌని ఐలయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మేక వీరన్న, ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సనప పొమ్మన్న, ఆలకుంట్ల సాయిలు, బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకులు హలావత్‌ లింగన్న మాట్లాడారు. కార్మిక వ్యతిరేక లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం, పంటలకు మద్దతు ధర, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ కంపెనీలకు, అమెరికాకు వత్తాసు పలుకుతూ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. దేశంలో పెరిగిన ధరలను తగ్గించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో నందగిరి వెంకటేశ్వర్లు, జడ సత్యనారాయణ, బూర్క వెంకటయ్య, సూర్యం, వీరభద్రం, పర్వత కోటేష్‌, గజ్జి సోమన్న, సామ పాపయ్య, బోనగిరి మధు, ఏపూరి వీరభద్రం, కోటమ్మ, జలగం ప్రవీణ్‌, రాజమల్లు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌కేఎం ఆధ్వర్యంలో నిరసన, నాయకుల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement