విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండలో నిర్వహించిన టీపీటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను, వివిధ రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, గొడిశాల రమేశ్, జిల్లా కార్యదర్శి అంకం శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జగపతిరావు, సీనియర్ బాధ్యులు సుబ్బారావు, జిల్లా కమిటీ బాధ్యులు వీరభద్రం, చక్రునాయక్, కుమారస్వామి, సదానందం, చంద్రమౌళి, చందర్‌నాయక్, కొమురయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


