కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఈనెల 12, 13 తేదీల్లో కేయూ పరిపాలన భవనం సెనెట్ హాల్‌లో జాతీయ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఇందుకు సంబంఽధించిన ఆహ్వాన పత్రికను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రంతో కలిసి పలువురు ఆవిష్కరించారు. కేయూ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ), స్టేట్ ఎక్సఫర్ట్ అప్రైజరల్ కమిటీ (ఎస్‌ఈఏసీ), ఎన్విరాన్‌మెంటల్ ప్రొఫెషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సినరైజింగ్ ఇనిస్టిట్యూషన్స్ ఆఫర్ సస్టేయినబుల్ డెవలప్‌మెంట్ స్ట్రాటెజిక్ అండ్ మల్టి–షేక్ హెల్డర్ అప్రోచ్ టూ పొల్యూషన్ కంట్రోల్ అనే అంశంపై ఈ జాతీయ సదస్సును రెండు రోజుల పాటు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమల నుంచి ఇప్పటికే 150 మంది ప్రతినిధులు నమోదు చేసుకున్నారని తెలిపారు.
ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన రిజిస్ట్రార్


