● మత్తు పదార్థాల నిర్మూలనపై
ప్రభుత్వ ఉపాధ్యాయుడి అవగాహన
పాలకుర్తి టౌన్ : మత్తు పదార్థాలతో కలిగే అనర్ధాలపై సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ పోతురాజు వేషధారణలో వినూత్న ప్రచారం చేస్తున్నారు. సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలోని సంతలో మైకులో మత్తు పదార్థాలు–అనర్ధాలు, రోడ్డు భద్రత, హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై అవగాహన కల్పించారు. ‘నో డ్రగ్స్–సేవ్ లైఫ్’ అంటూ కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. యువతను నన్మార్గంలో నడిపించేందుకు తన వంతు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై డ్రగ్స్, గంజాయికి యువతను దూరంగా ఉంచాలని కోరారు.


