‘పెద్ది’ విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చడం దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

‘పెద్ది’ విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చడం దుర్మార్గం

Aug 11 2026 1:18 AM | Updated on Aug 11 2026 1:18 AM

నర్సంపేట : దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందు కు నిర్మించిన గద్దెను మున్సిపల్‌ అధికారులు కూల్చేయడం దుర్మార్గమని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. నర్సంపేట పట్టణంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టి ధర్నా నిర్వహించా రు. అనంతరం విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసిన గద్దె కూల్చేసిన ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్ని ఆటంకాలు సృష్టించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఆవిష్కరించి తీరుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఆకుల శ్రీనివాస్‌, డాక్టర్‌ లెక్కల విగ్యాసాగర్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, బత్తిని శ్రీనివాస్‌, నాగెల్లి వెంకటనారాయణగౌడ్‌, నాడెం శాంతికుమార్‌, గోనె యువరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement