ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలి

Aug 11 2026 1:18 AM | Updated on Aug 11 2026 1:18 AM

సీఎంను కలిసిన డీడీఎన్‌ అర్చకులు

హన్మకొండ కల్చరల్‌ : ధూపదీప నైవేద్య (డీడీఎన్‌) అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్‌ గంగు ఉపేంద్రశర్మ, ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నావజ్జుల ప్రసాద్‌శర్మ, ప్రధాన కార్యదర్శి వెగ్గళం సంతోష్‌శర్మ, జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ పరాశరం రవీంద్రాచార్యులు, నల్లగొండ జిల్లా డీడీఎన్‌ అధ్యక్షుడు పైడిమర్రి ప్రసాద్‌శర్మ తదితరులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సోమవారం నాగార్జునసాగర్‌ డ్యామ్‌ వద్ద వరుణయాగానికి హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి వారు సమస్యలను వివరించారు. ఉద్యోగ భద్రత కోసం దేవాదాయశాఖ ద్వారా నియామక పత్రాలు అందించాలని, పేస్కేల్‌ వర్తింపచేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి డీడీఎన్‌ అర్చకుల సమస్యలను పరిష్కరించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను ఆదేశించారు.

గోదావరి పుష్కరాలకు

నిధులు మంజూరు

కాళేశ్వరం : మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా మొదటి ప్రాధాన్యత కింద టెయిర్‌–1లో రూ. 88.80కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిసింది. ఇరిగేషన్‌శాఖ రూ.60 కోట్లు, ఆర్‌అండ్‌బీ రూ.20.90 కోట్లు, పంచాయతీరాజ్‌ రూ. 5.90 కోట్లు, ఎండోమెంట్‌ రూ. 2 కోట్లు మంజూరు చేయగా.. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా శాఖలు క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల వివరాలు సేకరించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్‌ నుంచి భద్రాచలం వరకు ఉన్న పుష్కర ఘాట్లకు రూ. వివిధ శాఖల ద్వారా రూ. 645 కోట్లు ప్రభుత్వం మంజూరు చేశారు.

కాళేశ్వరంలో..

రూ.88.80కోట్లతో వివిధ శాఖలతో పాటు ఇరిగేషన్‌శాఖ నిధులతో అష్ట తీర్ధాల అభివృద్ధి, ఘాట్ల విస్తరణ, పలు దేవత విగ్రహాలు, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ఆర్‌అండ్‌బీ శాఖతో పలు చోట్ల కల్వర్టులు, హైలెవల్‌ వంతెనలు నిర్మించనున్నారు. పంచాయతీ రాజ్‌ నిధులతో మజీద్‌పల్లి, ప్రధాన రహదారి, ఇతర రహదారులు నిర్మించనున్నారు.

రూ.198 కోట్లతో దేవస్థానం..

రూ.198కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణలో భాగంగా పునర్‌నిర్మాణం పనులు ముమ్మరం చేసింది.రాతి నిర్మాణం కోసం శ్రావణ మాసంలో భూమి పూజకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 13 తర్వాత ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే పది రోజులుగా కూల్చివేత పనులు తుది దశకు చేరాయి.

చిన్నారిపై పిచ్చికుక్క దాడి

టేకుమట్ల : మండల కేంద్రానికి చెందిన వారాల ఉమేష్‌ కూతురు ఆద్య సోమవారం ఇంటి ఎదుట ఆడుకుంటుండగా అక్కడే ఉన్న పిచ్చికుక్క పాప ముఖంపై దాడి చేసింది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు కుక్కను తరిమి వేయడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా కుక్క దాడిలో పాపకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు.

కన్నాయిగూడెంలో ఆరుగురిపై..

కన్నాయిగూడెం : మండలంలో వివిధ గ్రామాల్లో సోమవారం ఒక్కరోజే ఆరుగురిపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. బుట్టాయిగూడెంలో ముగ్గురిపై, మండల కేంద్రంలో ఇద్దరిపై దాడి చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement