కొత్తగూడ: రాజ్యాంగంలో పొందుపర్చిన ఆదివాసీ హక్కులను సాధించుకుందామని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. షెడ్యూల్డ్ చట్టాలు, 1/70 చట్టం, పీసా చట్టం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పూర్తి స్థాయిలో హక్కుపత్రాలు ఇవ్వాలని కోరారు. గాంధీనగర్ నుంచి కొమురంభీం విగ్రహం వరకు విద్యార్థుల థింసా నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్, కొమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుడుంద్బె జాతీయ అధ్యక్షుడు వట్టం ఉపేందర్ జెండా ఆవిష్కరించగా.. వివిధ సంఘాల నాయకులు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ఆదివాసీ నాయకులు, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ, మాస్‌లైన్ పార్టీలు వేర్వేరుగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాయి.


