7 అంశాలపై మదింపు..
సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణలో వైద్య విద్యకు కీలక కేంద్రంగా ఉన్న కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఐఐఆర్‌ఎఫ్–2026 (ఇండియన్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) మెడికల్ ర్యాంకింగ్స్‌లో వరంగల్ కేఎంసీ 60వ స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా 144 వైద్య కళాశాలలను వివిధ అంశాల ఆధారంగా అంచనా వేయగా.. కేఎంసీకి 870.10 స్కోర్ లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ 43వ ర్యాంకు (895.87 స్కోర్)తో ముందంజలో ఉండగా.. ఉస్మానియా మెడికల్ కాలేజీ 51వ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత స్థానంలో కేఎంసీ 60వ ర్యాంకు (870.10 స్కోర్), ఆదిలాబాద్ రిమ్స్ 139వ ర్యాంకు (761.28 స్కోర్) సాధించింది.
వైద్య విద్య.. వైద్య సేవలకు వెన్నెముక..
1959లో ప్రారంభమైన కేఎంసీ ఆరు దశాబ్దాలకు పైగా వైద్య విద్యలో సేవలందిస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్‌తోపాటు పీజీ, సూపర్ స్పెషాలిటీ తది తర కోర్సులను అందిస్తోంది. కేఎంసీలో 32 విభా గాలు, 242 మంది ఫ్యాకల్టీ, అనుబంధంగా 8 ఆస్పత్రులున్నాయి. కేఎంసీకి అనుబంధంగా ఉన్న మహా త్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ స్థాయి వైద్యసేవల కేంద్రాల్లో ఒకటి. వరంగల్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో కేఎంసీలో వైద్య విద్య అ భ్యసించే విద్యార్థులకు తరగతి గదులతోపాటు విస్తృతమైన క్లినికల్ ఎక్స్‌పోజర్ లభిస్తోంది.
టాప్–50లోకి దూసుకెళ్లేందుకు దృష్టి..
కేఎంసీలో ఎంబీబీఎస్‌తోపాటు వివిధ పీజీ కోర్సులు కొనసాగుతున్నాయి. జనరల్ మెడిసిన్, రేడియాలజీ, సైకియాట్రీ తదితర విభాగాల్లో పీజీ కో ర్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా యూరాలజీ, ిపీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, కా ర్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ, కార్డియాలజీ వంటి విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ శిక్షణకు కూడా అవకాశాలున్నాయి. కేఎంసీ 60వ స్థానంతో ఆగకుండా.. పరిశోధన, మౌలిక వసతులు, వైద్య సే వలు, బోధనా ప్రమాణాలను మరింత బలోపేతం చేసి టాప్–50లోకి దూసుకెళ్లాలన్నదే ఇప్పుడు తదు పరి లక్ష్యంగా పనిచేసే దిశగా కళాశాల బృందం పనిచేయాలని ఆలోచిస్తోంది.
జాతీయ స్థాయిలో
కేఎంసీకి 60వ ర్యాంక్
ఐఐఆర్‌ఎఫ్ 2026 మెడికల్
ర్యాంకింగ్స్‌లో ఓరుగల్లు సత్తా
870.10 మార్కులతో
రాష్ట్రంలో మూడో స్థానం
కేఎంసీకి కన్నా మెరుగ్గా గాంధీ, ఉస్మానియా కాలేజీలు
భవిష్యత్‌లో టాప్–50లో ఉండడంపై సిబ్బంది దృష్టి
కేఎంసీకి వచ్చిన 60వ ర్యాంకు కేవలం వైద్య విద్య నాణ్యతపైనే ఆధారపడింది కాదు. బోధన–అభ్యసన వనరులు, పరిశోధన, విద్యార్థుల కెరీర్ ఫలితాలు, పరిశ్రమలతో అనుసంధానం, ప్లేస్‌మెంట్ వ్యూహాలు, భవిష్యత్ దృష్టి, కళాశాలపై బాహ్య గుర్తింపు వంటి అంశాలను ఐఐఆర్‌ఎఫ్ పరిశీలించింది. ప్రతీ విభాగంలో వచ్చిన స్కోర్లను నిర్దిష్ట వెయిటేజీతో కలిపి 1,000 పాయింట్లకు కేఎంసీ 870.10 స్కోర్ సాధించి దేశంలో 60వ స్థానంలో నిలిచింది.


