● మరిపెడలో ఘటన
మరిపెడ : లారీ.. బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మరిపెడలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం దబ్బతండాకు చెందిన బానోత్ వెంకట్రాం(45) పనుల నిమిత్తం బైక్‌పై మండల కేంద్రానికి వచ్చాడు. పనులు ముగించుకుని తిరిగి తండాకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఖమ్మం నుంచి తొర్రూరు వైపునకు వెళ్తున్న లారీ వెనుక వైపు నుంచి ఢీకొంది. ఈ ఘటనలో వెంకట్రాం అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనా స్థలికి ఎస్సై గండ్రాతి సతీశ్ చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు. అనంతరం మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.


