కొత్తగూడ: మతిస్థిమితం లేని వృద్ధురాలు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్జ నర్సమ్మ(80)కు మతి స్థిమితం లేదు. నాలుగు రోజులుగా నర్సమ్మ కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పక్క గ్రామాల్లో గాలించినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఆదివారం రాళ్లవాగులో పశులకాపరికి మృతదేహం కనిపించింది. ఆనవాళ్లను బట్టి నర్సమ్మగా గుర్తించిన కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.


