పోలీస్‌ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ అమరుల త్యాగాలతోనే నేడు శాంతి

Aug 10 2026 1:34 AM | Updated on Aug 10 2026 1:34 AM

నేడు ములుగు జిల్లాలో

డీజీపీ పర్యటన

వరంగల్‌ క్రైం: పోలీస్‌ అమరుల త్యాగాలతోనే నేడు వరంగల్‌ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం, శాంతిభద్రతలు ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పర్యటనలో భాగంగా నక్సలిజంపై పోరాటంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 28 మంది పోలీస్‌ అమరవీరుల కుటుంబీకులతో ఆదివారం సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్‌ అమరవీరులు, బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు ‘టీజీ – వీర్‌’ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్‌ పోర్టల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోర్టల్‌ ద్వారా అమరవీరుల కుటుంబ సభ్యులు తమకు సంబంధించిన ఆర్థిక సాయం, ఎక్స్‌గ్రేషియా, కారుణ్య నియామకాలు, ఇంటి స్థలాల కేటాయింపు, స్థలాల రిజిస్ట్రేషన్‌/టైటిల్‌ సమస్యలు, పెన్షన్‌, ఇతర సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పరంగా అందాల్సిన ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదులను ఒకే వేదిక ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ పోర్టల్‌ను రూపొందించిన ఎస్‌ఐబీ అధికారులు రాష్ట్రంలోని అన్ని యూనిట్లకు వెంటనే సమాచారం అందించి, ఆయా యూనిట్ల పరిధిలోని అన్ని పోలీస్‌ అమరవీరుల కుటుంబాల నుంచి సమస్యలు, ఫిర్యాదులు సేకరించి, వాటిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు అవసరమైన సహకారం అందిస్తూ వారి సమస్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేతను ఆదేశించారు. తన వృత్తి జీవిత ప్రారంభ దశలో నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో వరంగల్‌లో విధులు నిర్వహించిన తాను విధి నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన పోలీస్‌ అధికారులు, సిబ్బంది కుటుంబాల బాధను అర్థం చేసుకోగలనని తెలిపారు.

డీజీపీ సీవీ ఆనంద్‌

పోలీస్‌ అమరవీరుల కుటుంబాల కోసం ‘టీజీ వీర్‌’

నూతన కమిషనరేట్‌ భవన

సముదాయం సందర్శన

ములుగు రూరల్‌/వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలంలోని కర్రెగుట్టలను డీజీపీ సీవీ ఆనందర్‌ సోమవారం సందర్శించనున్నట్లు ములుగు ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు డీజీపీ ములుగు జిల్లా కేంద్రం నుంచి కర్రెగుట్టలకు బయలుదేరుతారని పేర్కొన్నారు. ఉదయం 7.30 గంటలకు పామనూరు సందర్శిస్తారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం గోవిందరావుపేట మండలం చల్వాయి ఐదో బెటాలియన్‌ సందర్శన, అనంతరం భోజనం చేస్తారు. అనంతరం ములుగు పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మాజీ మావోయిస్టులతో సమావేశం కానున్నారు. చివరిగా మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement