కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సుల (నాన్‌ప్రొఫెషనల్) రెండో సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్ అండ్ ఇంప్రూవ్‌మెంట్) ఈనెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల ని యంత్రణాధికారి పి. శ్రీనివాస్ తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఫుడ్ సైన్స్ అండ్ టె క్నాలజీ, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం, ఎంఎల్‌ఐఎస్‌సీ, ఎంటీఎం, ఎంహెచ్‌ఆర్‌ం, ఎంఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, 31 తేదీల్లో నిర్వహించనున్నామని వారు తెలిపారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు.
టిఫిన్ సెంటర్‌లో
చోరీ : ఇద్దరి అరెస్ట్
కాజీపేట: కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ టిఫిన్ సెంటర్‌లో ఇటీవల చోరీకి పాల్ప డిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి రూ.1.05 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్యాంసుందర్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఎస్సైలు శివ, మోనికారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీరటి అన్వేష్, జాడి రాజేష్ మూసిఉన్న తాజ్ టిఫిన్ సెంటర్‌లోకి చొరబడి విలువైన వస్తువులను అపహరించారు. హోటల్ యజమాని పొగళ్ల జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని సామగ్రి పట్టుకున్నట్లు తెలిపారు. కేసును రెండు రోజుల్లో ఛేదించిన సిబ్బంది వి.క్రాంతికుమార్, జి.కుమారస్వామి, సల్మాన్ పాషాను సీఐ శ్యాంసుందర్ అభినందించారు.
పుష్పాలంకరణలో మెట్టు రామలింగేశ్వరుడు
కాజీపేట అర్బన్: కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని మెట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయంలో మెట్టుగుట్టపై పవిత్రోత్సవాలను ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. మెట్టు రామలింగేశ్వర స్వా మి సేవా సమితి ఆధ్వర్యంలో రెండో ఆది వారం సందర్భంగా మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించి రామలింగేశ్వరుడిని పుష్పాలతో అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, అర్చకులు అభిలాష్‌శర్మ, విష్ణువర్ధనాచార్యులు, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ రఘుచందర్ తదితరులు పాల్గొన్నారు.


