ప్రభుత్వం దృష్టికి ఆస్పత్రుల సమస్యలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం దృష్టికి ఆస్పత్రుల సమస్యలు

Aug 10 2026 1:34 AM | Updated on Aug 10 2026 1:34 AM

కాశిబుగ్గ: రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు అన్నారు. వరంగల్‌ ములుగు రోడ్డులోని వజ్ర గార్డెన్‌లో తెలంగాణ హాస్పిటల్స్‌, నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 11వ వార్షిక రాష్ట్ర మహాసభ ‘థానాకాన్‌–2026’ను ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ఆస్పత్రుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చర్చించడానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. వైద్యం కోసం వచ్చిన రోగులను ప్రేమపూర్వకంగా చూస్తూ, మెరుగైన వైద్యసేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా మహాసభలో వైద్యరంగంలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

థానా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా

డాక్టర్‌ ప్రవీణ్‌ ప్రమాణ స్వీకారం..

థానా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా హనుమకొండకు చెందిన డాక్టర్‌ పి.ప్రవీణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న, మధ్యతరహా ఆస్పత్రుల సమస్యలను గుర్తించి సకాలంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. మహాసభ ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ ప్రవీణ్‌, కో చైర్మన్‌ ముక్కా దిలీప్‌కుమార్‌, సెక్రటరీ ఎల్‌.నాగేశ్వర్‌రావు, కోశాధికారి వి.నరేష్‌కుమార్‌, వద్దిరాజు రాకేష్‌, రాష్ట్ర అఽధ్యక్షుడు అరుణ్‌ కటారి, ప్రధాన కార్యదర్శి ఎంవీ ప్రసాద్‌, కోశాధికారి కె.అశోక్‌కుమార్‌, పూర్వ అధ్యక్షుడు ఎల్‌ సురేష్‌ గౌడ్‌, ఎస్‌.నౌనిపాల్‌ సింగ్‌, వి.అశోక్‌, మహేష్‌బాబు, గుండేటి రమేష్‌, కాళీప్రసాద్‌రావు, నర్సింగారెడ్డి, అశోక్‌రెడ్డి, నరసింహారావు, విజయ్‌చందర్‌రెడ్డి, కస్తూరి ప్రమీల, శేషు మాధవ్‌, విద్యాసాగర్‌, దశరథం, సుదీప్‌, సుధీర్‌కుమార్‌, కొత్తగట్టు శ్రీనివాస్‌, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు

ఘనంగా థానాకాన్‌–2026

11వ వార్షిక రాష్ట్ర మహాసభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement