ఏఐసీసీ చీఫ్‌ను కలిసిన డాక్టర్‌ రామకృష్ణ | - | Sakshi
Sakshi News home page

ఏఐసీసీ చీఫ్‌ను కలిసిన డాక్టర్‌ రామకృష్ణ

Aug 9 2026 1:58 AM | Updated on Aug 9 2026 1:58 AM

హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగనున్న వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానా నికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ హనుమకొండకు చెందిన డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. రామకృష్ణ చారి టబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా, పార్టీలో సీనియర్‌గా వరంగల్‌ నియోజకవర్గం, క్షేత్రస్థాయిలో పార్టీ బలో పేతం కోసం చేస్తున్న కృషిని వారికి వివరించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసిన అనుభవాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తన తాత, తండ్రి సైతం కాంగ్రెస్‌ పార్టీగా విధేయుడిగా ఉన్న ట్లు తెలిపారు. దశాబ్దానికి పైగా పార్టీ కోసం శ్ర మిస్తున్న తనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అ వకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వంలో భాగమయ్యే కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవితోనైనా ప్రజలకు మరింత చేరువవుతానని తెలిపారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి తనకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 30 లేఖలు సిఫారసు చేశానని రామకృష్ణ వారికి వినతిపత్రం అందజేశారు.

మధ్యవర్తుల వలలో పడొద్దు

సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో

ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ రాలేదు

ఎంజీఎం అధికారుల స్పష్టీకరణ

కాశిబుగ్గ: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల కాలేదని ఎంజీఎం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాల పేరుతో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైన అనంతరమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. అయితే ఇటీవల 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ హా స్పిటల్‌ వద్ద ఓ వ్యక్తి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్న ట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయలు డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగులను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంజీఎం ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారని కూడా వదంతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి అధికారులు ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement