కాశిబుగ్గ: వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సి టీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్‌గా డాక్టర్ జేవీ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా చోంగ్తు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు అదనపు డీఎంఈ హోదాలో ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. ఆయన మూడు సంవత్సరాల పాటు ఫారెన్ సర్వీసు డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తించారు. ఇప్పటి వరకు హెల్త్ వర్సిటీ ఇన్‌చార్జ్ రిజి స్ట్రార్‌గా ఉన్న డాక్టర్ నాగార్జునారెడ్డి ఇకనుంచి జాయింట్ రిజిస్ట్రార్‌గా పనిచేయనున్నారు. కాగా, నూతన రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ఓరుగల్లుతో రిజిస్ట్రార్‌కు అనుబంధం..
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా నియమితులైన డాక్టర్ వెంకటేశ్వర్లుకు ఓరుగల్లుతో అనుబంధం ఉంది. ఎంజీఎం ఆస్పత్రిలోనే ఆయన 26 సంవత్సరాలపాటు ఆర్థోపెడిక్ విభాగంలో విధులు నిర్వర్తించారు. 1998 నుంచి 2024 వరకు ఎంజీఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా, హెచ్‌ఓడీగా, డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. 2024 నుంచి 2025 వరకు యాదాద్రి జిల్లా భువనగిరిలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించారు. 2025 నుంచి 2026 సంవత్సరం ఇప్పటి వరకు భూపాలపల్లి వైద్య కళాశాలలో అడిషనల్ డీఏంఈ హోదాలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.


