వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు శనివారం ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 1,800 మంది క్రీడాకారులు హాజరుకాగా, అండర్–06, 08, 10,12 బాలబాలికలు, యూత్ విభాగంలో అండర్–18తోపాటు అండర్–14, 16, 20 మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మెత్తం 60 ఈవెంట్లలో జరిగిన పోటీల్లో విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
విజేతలకు పతకాలు,
సర్టిఫికెట్ల ప్రదానం


