తెగిన రైల్వే విద్యుత్‌ తీగ | - | Sakshi
Sakshi News home page

తెగిన రైల్వే విద్యుత్‌ తీగ

Aug 9 2026 1:58 AM | Updated on Aug 9 2026 1:58 AM

కాజీపేట రూరల్‌: కాజీపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని హసన్‌పర్తి–ఉప్పల్‌ మధ్య ఉన్న మెయిన్‌ డౌన్‌లైన్‌లో శనివారం రైల్వే ఓహెచ్‌ఈ విద్యుత్‌ తీగ తెగిపోయింది. దీంతో సెక్షన్‌లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తి–ఉప్పల్‌ మధ్య గల ఆర్వో బ్రిడ్జిపై కేబుల్‌ లాగుతుండగా రైల్వే ఓహెచ్‌ఈ విద్యుత్‌ తీగపై పడింది. ట్రిప్‌ అయి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో బల్లార్షా నుంచి కాజీపేట వెళ్లే నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌ సుమారు గంటన్నర పాటు ఉప్పల్‌–హసన్‌పర్తి మధ్య నిలిపివేసినట్లు తెలిపారు. అదేవిధంగా గూడ్స్‌ రైలు కూడా నిలిచిపోయిందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న జమ్మికుంట, కాజీపేట రైల్వే ఓహెచ్‌ఈ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి సుమారు 11 గంటల వరకు మరమ్మతులు చేసి యథావిధిగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. నాగ్‌పూర్‌ ప్యాసింజర్‌ ఆలస్యంతో కాజీపేటకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఉప్పల్‌–హసన్‌పర్తి మధ్య ప్యాసింజర్‌, గూడ్స్‌ రైలు నిలిపివేత

మరమ్మతులు చేపట్టి రాకపోకలను

పునరుద్ధరించిన రైల్వే సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement