టెక్నాలజీతో విద్యుత్‌ సరఫరాను బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

టెక్నాలజీతో విద్యుత్‌ సరఫరాను బలోపేతం చేయాలి

Aug 8 2026 1:53 AM | Updated on Aug 8 2026 1:53 AM

హన్మకొండ: విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అయ్యేందుకు ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ఇంధన శా ఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్ట ల్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాల యం నుంచి సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి, డైరెక్టర్లు, చీఫ్‌ ఇంజనీర్లు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు పాల్గొన్నా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ముందుగా వరుణ్‌ రె డ్డి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఎన్పీడీసీఎ ల్‌ పరిధిలో చేపట్టనున్న కార్యక్రమాలు, అమలవుతున్న కార్యక్రమాలపై వివరించారు. ఇందులో 33/ 11 కెవీ సబ్‌స్టేషన్లలో సోలార్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరే జ్‌ సిస్టమ్‌ ఏర్పాటు, రియాక్టివ్‌ పవర్‌ కాంపెన్సేషన్‌ కోసం 2 ఎంవీఏఆర్‌ కెపాసిటర్‌ బ్యాంకుల ఏర్పాటు గురించి వివరించారు. రోజు రోజుకు వి ద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ అవసరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 33/11 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద సోలార్‌, బ్యాటరీ స్టోరేజ్‌ ఏర్పాటు చేసే ప్రతిపాదనను వివరించారు. ఛార్జింగ్‌ సమయంలో ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ నష్టాలను తగ్గించడంతో పాటు అదనపు గ్రిడ్‌ లోడింగ్‌ను నివారించవచ్చని చెప్పారు. 33 కేవీ ఫీడర్లపై రియాక్టివ్‌ కరెంట్‌ను తగ్గించడం లక్ష్యంగా 347 సబ్‌స్టేషన్లలో 2 ఎంవీఏఆర్‌ కెపాసిటర్‌ బ్యాంకులు పెట్టామన్నారు. 2 ఎంవీఏఆర్‌ కెపాసిటర్‌ బ్యాంకు కరెంట్‌ను తగ్గించి పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. డైరెక్టర్లు వి.మోహన్‌ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్‌, సి.ప్రభాకర్‌, సీఈలు కె.తిరుమల్‌ రావు, అశోక్‌, మాధవ రావు, కె.వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్‌, నాగ ప్రసాద్‌, గౌతమ్‌ రెడ్డి, సీజీఎంలు చరణ్‌ దాస్‌, కిషన్‌, వేణు బాబు, జీఎం ప్రభావతి, డీఈలు కె.అనిల్‌ కుమార్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement