గడువులోగా జనగణన పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా జనగణన పూర్తి చేయాలి

Aug 8 2026 1:29 AM | Updated on Aug 8 2026 1:29 AM

మహబూబాబాద్‌: నిర్ణీత గడువులోగా జనగణన–2027 ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళికేరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి జనగణనపై సమీక్షించారు. ఈసందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ.. విద్య, ఆరోగ్యం, తాగునీరు తదితర అంశాలను సేకరించి జిల్లా గణన హ్యాండ్‌బుక్‌ నెట్‌ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సంబంఽధిత అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. వీసీలో కలెక్టర్‌ స్నేహశబరీష్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement