మహబూబాబాద్: మానుకోట పట్టణంలోని గాంధీ పార్కు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీపార్కును శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్కులో వాకింగ్ ట్రాక్, వేదిక ఇతర సందరీకరణ పనుల ప్రతిపాదనలను అధికారులతో తయారు చేయిస్తామన్నారు. ఎస్టిమేషన్‌ను బట్టి నిధుల మంజూరుపై ఆలోచిస్తామన్నారు. మానుకోట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు స్థానికులు సహకరించాలన్నారు. రాజకీయాలకతీతంగా మానుకోటను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సుమారు రూ.60 కోట్లు మంజూరు చేయించామని, ఆ పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం బంధం చెరువు వద్ద జరుగుతున్న వరద కాల్వల పనులను పరిశీలించారు. మినీ ట్యాంక్ బండ్ పనులపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, సీపీఐ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ అజయ్‌సారథిరెడ్డి, డీఈఈ సీహెచ్.ఉపేందర్, కౌన్సిలర్లు రేషపల్లి నవీన్, రాజు, నాయకులు నీరుటి లక్ష్మీనారాయణ, జ్ఞానేశ్వర్, పెరుగుకుమార్, వీరన్న, ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్


