భవనాన్ని అందుబాటులోకి తేవాలి | - | Sakshi
Sakshi News home page

భవనాన్ని అందుబాటులోకి తేవాలి

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

డీఈఓ సత్యనారాయణమూర్తి

కేసముద్రం: కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం మండలంలోని మహముద్‌పట్నం గ్రామంలోని కేజీబీవీని ఆయన సందర్శించారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని పరిశీలించారు. అప్డేట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన డీడీ రెండు రోజుల్లో అందజేస్తామని విద్యుత్‌శాఖ ఏడీకి తెలిపారు. 15 రోజుల్లో నూతన భవనం ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. అనంతరం ఆయన పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని, ఇంగ్లిష్‌లోనే బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో జీఈసీఓ గాయత్రి, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఓ అర్చన, సీఆర్టీలు, పీజీ సీఆర్టీలు పాల్గొన్నారు.

గోదాం ఖాళీ చేయించాలి..

కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లోని గోదాంలో హరికృష్ణ మూమెంట్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ సప్లైచేసే కేంద్రాన్ని డీఈఓ సందర్శించారు. గోదాంలో బస్తాలను ఖాళీచేసే పనులను ఆయన పరిశీలించారు. త్వరగా ఖాళీ చేయించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement