తప్పు చేస్తే శిక్ష తప్పదు | - | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే శిక్ష తప్పదు

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

దంతాలపల్లి: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తప్పు చేస్తే శిక్ష తప్పదని సీడీపీఓ ఎల్లమ్మ అన్నారు. మండలంలోని దొనకొండ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో ఇటీవల జరిగిన పరిణామాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాలింతలు, గర్భిణులు, శిశువుల తల్లులతో వాగ్మూలం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం ఇస్తున్నారా.. ప్రతీ నెల శిశువు బరువు చూస్తున్నారా.. అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామస్తుల వాగ్మూలం ప్రకారం నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. సర్పంచ్‌ ఆవుల శావణి, ఏసీసీడీపీఓ తేజాకల్యాణి, సూపర్‌వైజర్‌ శ్రీలత, ఉపసర్పంచ్‌ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement