మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీలో నాణ్యత, కొలతలు పాటించాలి. మూడు రకాల చేప పిల్లలను మాత్రమే అందిస్తున్నారు. అన్ని రకాల పిల్లలను చెరువుల్లో పోసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. చెరువులకు కేటాయించిన లెక్క ప్రకారం చేప పిల్లలు వదలాలి. అదను దాటకుండానే సమయానుకూలంగా పంపిణీ జరిగితే మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.
–పిట్టల వెంకన్న, తెలంగాణ మత్స్యకార్మిక
సంఘం జిల్లా కార్యదర్శి
పంపిణీకి చర్యలు
ప్రారంభించాం
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన చర్యలు ప్రారంభించాం. చేప పిల్లల పంపిణీ టెండర్ల ప్రక్రియ కోసం చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలి. చేప పిల్లల నాణ్యత, కొలతలు వంటివి మత్స్యకారులు, సంఘాల సభ్యులు చూసుకోవాలి. సీడ్ సక్రమంగా లేకుంటే తిప్పి పంపిస్తాం.
–భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అఽధికారి


