ఆపన్నహస్తం అందించరూ! | - | Sakshi
Sakshi News home page

ఆపన్నహస్తం అందించరూ!

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

దుగ్గొండి: వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామంలో శివరామాంజనేయస్వామి దేవాలయంలో అర్చకుడిగా కొనసాగుతున్న గాదెపాక రాములు ఆపన్నహస్తం ఎదురు చూస్తున్నారు. వా రం రోజుల క్రితం రాములుకు గుండెపోటు రావడంతో భక్తులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు రెండు స్టంట్లు వేసి ప్రాణం కాపాడారు. అయితే క నీస ఖర్చులకు లేక ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక సాయం అందజేయాలని వేడుకుంటున్నా రు. కాగా, దయార్థ హృదయులు స్పందించి రా ములుకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని ఏబీఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్‌ కోరారు. దాతలు.. రాములు బంధువు (దేవేందర్‌) 9951262401 నంబర్‌కు ఫోన్‌పే ద్వారా పంపాలని అభ్యర్థించారు. కాగా, రాములు హనుమాన్‌ ఉపాసకుడిగా రాష్ట్ర వ్యాప్తంగా 1,116 హనుమాన్‌ ఆలయాల్లో విగ్రహాలకు చందనం వేసే కార్యక్రమం చేపట్టి ప్రజల్లో భక్తిభావం పెంపునకు కృషి చేశారని గ్రామస్తులు తెలిపారు.

గుండెపోటుతో నిమ్స్‌లో చేరిన

హనుమాన్‌ ఉపాసకుడు రాములు

ఆర్థిక సాయం అందించాలని

వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement