‘సూపర్‌’ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి | - | Sakshi
Sakshi News home page

‘సూపర్‌’ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

కాశిబుగ్గ: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పురోగతిపై 24 అంతస్తుల ఆస్పత్రి ఆవరణలోని కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్‌, తాగునీరు, పారిశుద్ధ్య పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంఽధిత శాఖ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సమీక్షలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రమేశ్‌బాబు, విద్యుత్‌ ఎస్‌ఈ ఆనందం, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇంజనీర్‌ శ్రవణ్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఇఇ దేవిక చౌహాన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement