ఇలా.. 24 అంతస్తులు | - | Sakshi
Sakshi News home page

ఇలా.. 24 అంతస్తులు

Aug 7 2026 1:38 AM | Updated on Aug 7 2026 1:38 AM

ఇలా.. 24 అంతస్తులు

అందనున్న వైద్యసేవలు..

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇతర ఏర్పాట్లు..

కాశిబుగ్గ: హైదరాబాద్‌ తర్వాత రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్‌ మహానగరంలో సూపర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (24 అంతస్తులు) రూపు దిద్దుకుంటోంది. ఆ ధునిక హంగులు, అధునాతన సౌకర్యాలతో రోగులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ని ర్మిస్తున్న ఈ పెద్దాస్పత్రి ఈ ఏడాది చివరి నా టికి ప్రారంభోత్సవం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మాత్రం కచ్చితంగా చెప్పడం లేదు.

12 ఎకరాలు.. 2,018 పడకలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వరంగల్‌లో చేపట్టిన 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ భవన నిర్మాణ పనులు చివరి దశ కు చేరుకున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల కు పెద్ద దిక్కువగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో సమీపంలోనే జీ+23 అంతస్తులతో నిర్మిస్తున్నారు. 2,018 పడకలతో దాదాపు 12 ఎకరా ల్లో చేపట్టారు. తెలంగాణలోని అతిపెద్ద సూ పర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోగులు ఇక మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లకుండానే ఇక్కడ అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

ఒక్కో అంతస్తులో పలు వైద్య విభాగాల ఏర్పాటు

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో పలు ప్రత్యేకతలు

ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

హైదరాబాద్‌కు

వెళ్లకుండానే ఓరుగల్లులోనే మెరుగైన వైద్యం

24 అంతస్తుల్లో ఉండే విభాగాలు..

ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దుల ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనివల్ల హైదరాబాద్‌లోని ఆస్పత్రుల మీద ఒత్తిడి తగ్గే అవకాశం లేకపోలేదు. అయితే, 24 అంతస్తుల్లో ఏఏ విభాగాలు ఉంటాయో వైద్యాఽధికారులు సూచనప్రాయంగా నిర్ణయించిన వివరాలు.

ఒకటో అంతస్తు : ఓపీ, క్యాజువాలిటీ, అత్యవసర వైద్యసేవలు

రెండో అంతస్తు : పూర్తిగా అధునాతన ఐసీయూ సేవలు

మూడు, నాలుగు అంతస్తులు : పలు విభాగాలకు సంబంధించిన ఆపరేషన్‌ థియేటర్లు

6 నుంచి 12 అంతస్తులు : పలు డిపార్ట్‌మెంట్ల వార్డులు

13వ అంతస్తు : ల్యాబ్‌లు, బ్లడ్‌ బ్యాంకు ఏర్పాటు

14, 15 అంతస్తులు : మెయింటెనెన్స్‌, టీచింగ్‌

16, 17, 18 అంతస్తులు : ఫ్యాకల్టీ టీచింగ్‌, డెమో క్లాసులు

19, 20, 21 అంతస్తులు : రెసిడెంట్‌ డాక్టర్లు (పీజీలు)

22, 23 అంతస్తులు : ఆడిటోరియం, ఏబీసీ బ్లాకులు ఏర్పాటు

కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో,

ఆంకాలజీ–క్యాన్సర్‌

పిడియాట్రిక్స్‌, గైనకాలజీ, ఆర్థోపెడిక్‌, ప్లాస్టిక్‌ సర్జరీ

కిడ్నీ, లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌

అడ్వాన్స్‌డ్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్స్‌, ఐసీయూ,

ఆపరేషన్లు థియేటర్లు

వైద్య విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యసేవలు

ఫిజియోథెరపి, ఆర్గాన్‌ ట్రిట్‌మెంట్‌,

వృద్ధుల కోసం ప్రత్యేక చికిత్స

హిమోఫిలిటీ (రక్త సంబంధ వ్యాధులు)

సర్జికల్‌ ఆంకాలజీ, రేడియేషన్‌, కీమోథెరపి, సర్జరీలు

న్యూక్లియర్‌ థెరపి, డయాలసిస్‌ సెంటర్‌

కార్డియో థోరాసిక్‌, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వైద్యులు త్వరితగతిన వచ్చి వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేకంగా రోడ్డు సదుపాయం కల్పించారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ, పీఎంఎస్‌ఎస్‌వై సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నుంచి వైద్యులు నేరుగా వాహనాల్లో వచ్చే విధంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. కేఎంసీకి వెళ్లడానికి అడ్డుగా ఉన్న గోడను కూలగొట్టి పనులు చేపట్టారు. హాస్పిటల్‌కు వచ్చే రోగులు బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉండడంతో పలు సర్వీసులను సూపర్‌ స్పెషాలిటీ ఆవరణలోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement