ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని సమ్మక్క గద్దె పక్కన నాగులమ్మకు నీడనిచ్చేలా జువ్వి చెట్టును ఏర్పాటు చేశారు. 2014లో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్వి వృక్షం వంద ఏళ్లకు పైగా వయసు ఉండి పూర్తిగా ఎండిపోవడంతో తొలగించారు. పలుమార్లు జువ్వి మొక్కలు నాటినా పెరగకుండా పోయాయి. దీంతో జువ్వి మొక్క నాటినా ఇప్పట్లో పెరగదనే ఆలోచన మేరకు దేవాదాయశాఖ అధికారులు ఎండోమెంటల్ కార్యాలయ ఆవరణలో ఉన్న జూవ్వి వృక్షాన్ని ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా సమ్మక్క గద్దె పక్కన ఏర్పాటు చేశారు. ఈ చెట్టు సంరక్షణను ‘వటా ఫాండేషన్ ది బిగ్ ట్రీ క్వెస్ట్’ అనే సంస్థకు అప్పగించినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. కాగా, సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్వి వృక్షంపై జాతర సమయంలో నాగు పాము కనిపించేదని భక్తుల విశ్వాసం.
సమ్మక్క గద్దె పక్కన జువ్వి చెట్టు ఏర్పాటు


