హన్మకొండ: తెలంగాణకు జరుగుతున్న న ష్టం, అన్యాయాన్ని భావజాల వ్యాప్తితో ప్ర జల్లోకి చేరవేయడం ద్వారా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేతమైందని, భావజాల వ్యాప్తికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఎనలేని కృషి చేశారని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్ర పటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, మధుసూదన్, సి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
చెక్కు అందజేత
విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి టీజీ ఎన్పీడీసీఎల్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ టౌన్ డివిజన్ కాజీపేట సెక్షన్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వహస్తూ ఊకంటి ప్రకాశ్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాగా, ఆయన భార్య సంధ్యకు యూనియన్ బ్యాంకు బీమా ద్వారా క్లెయిమ్ రూ.1.05 కోట్లు మంజూరు చేయగా గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎండీ వరుణ్ రెడ్డి చెక్కు అందించారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి
వరుణ్ రెడ్డి


