అరకొర వసతులు | - | Sakshi
Sakshi News home page

అరకొర వసతులు

Aug 6 2026 12:51 AM | Updated on Aug 6 2026 12:51 AM

ఇరుకు గదులు ..

వరంగల్‌ స్పోర్ట్స్‌: క్రీడా పాఠశాలను జిల్లాకు తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకున్న ప్రజాప్రతినిధులు ప్రారంభించి చేతులు దులుపుకున్నారు. ప్రారంభమైన రోజు వెళ్లిన ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు అటువైపు తిరిగి కన్నెత్తి చూడలేదు. క్రీడాకారులకు మెరుౖగైన వసతులు కల్పించామా.. పిల్లలకు ఏమైనా సమస్యలున్నాయా అని ఆరాతీసిన వారే కరువయ్యారు. క్రీడా పాఠశాల ప్రారంభమైన రెండో విద్యా సంవత్సరానికే నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. మెరుగైన వసతులు కల్పించాల్సిన అధికారులు ఏదో నడిస్తే చాలు అన్నట్లు మమ అని పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రీడా పా ఠశాలపై నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మరో ఏడాది కొనసాగడం కష్టమేనని పలువురు వాపోతున్నారు.

ఆర్భాటంగా ప్రారంభం..

స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో గత ఏడాది నవంబర్‌ 16వ తేదీన మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌ చేతుల మీదుగా క్రీడా పాఠశాల ఆర్భాటంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విద్యార్థులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశారు. క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలతో తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తమ పిల్లలను క్రీడా పాఠశాలలో చేర్పించారు. తీరా చూస్తే చెప్పిన మాటలకు ఇక్కడి పరిస్థితులకు పొంతన లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

141 మంది విద్యార్థులు.. ఏడుగురు టీచర్లు

పలు జిల్లాలకు చెందిన విద్యార్థులతో మొదటి సంవత్సరం క్రీడా పాఠశాలలో 4వ తరగతి కొనసాగింది. ఈ విద్యా సంవత్సరంలో 4 తరగతితో పాటు 5 వ తరగతి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ప్ర స్తుతం క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో బాలురు 39, బాలికలు 40 మంది విద్యను అభ్యసిస్తున్నారు. 5వ తరగతిలో బాలురు 34 మంది, బాలికలు 28 మంది ఉన్నట్లు క్రీడాశాఖ అధికారులు తెలిపారు. విద్యాబోధన కోసం ముగ్గురు ఉపాధ్యాయినులు, ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రిన్సిపాల్‌ విధులు నిర్వర్తిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

కరువైన ధోబీ..

క్రీడా పాఠశాల చిన్నారుల బట్టలు ఉతికేందుకు ధోబీ లేకపోవడం బాధాకరం. గత ఏడాది ధోబీ బట్టలు ఉతకగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ధోబీని నియమించడంలో క్రీడాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్నం తినడమే సరిగా రాని చిన్నారులు వారి బట్టలను వారే ఉతుక్కోవాల్సిన దుస్థితి నెలకొనడం శోచనీయం.

బాటిల్‌ నీళ్లతోనే సరి..

చిన్నారులు మెస్‌లో భోజనం చేసిన అనంతరం బాటిల్‌లో వాటర్‌ పట్టుకుని రావాల్సిందే. బాటిల్‌లో నీళ్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు. స్పో ర్ట్స్‌ స్కూల్‌ విద్యార్థులు పడుకునే గదుల్లో కనీసం తాగునీటి వసతి కల్పించకపోవడం అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ధోబీ కావాలని

ప్రతిపాదనలు పంపించాం..

గత విద్యా సంవత్సరం చేసిన ధోబీ రేటు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో మానేసింది. దీంతో ధోబీ కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. పిల్ల లు పడుకునే గదుల వద్ద తాగునీటి కోసం త్వరలోనే రిఫ్రిజరేటర్లను ఏర్పాటు చే స్తాం. దోమల బెడద నుంచి కిటికీలకు మెష్‌ డోర్లను సైతం ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుతానికి నాలుగు గదుల్లో 73 మంది విద్యార్థులను సర్దుబాటు చేశాం. ఇంకో రెండు గదులు కావాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. వీలైనంత తొందర్లోనే గదుల కొరత లేకుండా చూస్తాం.

– ప్రశాంత్‌, డీవైఎస్‌ఓ, హనుమకొండ

4 గదులు.. 73 మంది బాలురు

4, 5 తరగతులకు 68 మంది బాలికలు, 73 మంది బాలురు ఉన్నారు. రాత్రి బస అనంతరం పడుకోవడానికి బాలికలను స్టేడియంలోని రీజినల్‌ స్పోర్ట్స్‌ హాస్టల్‌కు చెందిన సీనియర్‌ క్రీడాకారిణులతో జత చేర్చారు. బా లురకు మాత్రం 4 గదులు కేటాయించారు. ఒక్కో గదిలో 10 బెడ్లు వేయగా రెండు బెడ్లలో ముగ్గురు పడుకునేలా ఏర్పాటు చేశారు. కాగా, బెడ్‌షీట్లు, దుప్పట్ల పంపిణీ కరువవయ్యారు. కిటికీలకు మెష్‌ లేకపోవడంతో రాత్రంతా విద్యార్థులు దోమలతో సహవాసం చేస్తున్నారు. టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడంతో దుర్వాసన వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారులే బట్టలు ఉతుక్కోవాలి

బెడ్‌షీట్లు, దుప్పట్ల పంపిణీ కరువు

దోమలతో విద్యార్థుల సహవాసం

తాగునీటికి తప్పని తిప్పలు

చతికిలపడిన క్రీడా పాఠశాల నిర్వహణ

అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement