పలిమెల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన కుమ్మరి అంకయ్య (60) మంగళవారం గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. బుధవారం మహదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, పలిమెల ఎస్సై శశాంక్ అధ్వర్యంలో డీఆర్‌ఎఫ్, పోలీస్ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు గోదావరిలో ముమ్మర గాలింపు చేపట్టగా మధ్యాహ్నం అంకయ్య మృతదేహం లభ్యమైనట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.


