కాళేశ్వరం: జీర్ణోద్దరణలో భాగంగా కాళేశ్వరం దేవస్థానం ప్రధాన ఆలయాన్ని నేలమట్టం చేశారు. బు ధవారం ఉత్తర, పడమర గోపురాలు కూల్చివేశారు. దీంతో దక్షిణ గోపురం కూల్చివేతను రాత్రివరకు చేపట్టనున్నారు. వందల సంఖ్యలో గ్రామస్తులు కూ ల్చివేతలను తిలకిస్తున్నారు. తూర్పు రాజగోపురం మాత్రం గోదావరి పుష్కరాల అనంతరం కూల్చి పనులు చేపడుతారని ఆలయవర్గాలు తెలిపాయి.
శతాధిక వృద్ధురాలి మృతి
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతోలు గ్రా మానికి చెందిన శతాధిక వృద్ధురాలు షేక్.సైదాబీ (102) వృద్ధాప్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. సైదాబీ తన 102 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేకుండా జీవించడం విశేషం. సైదాబీకి ఆరుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. కోడళ్లు, అల్లుళ్లు, మనువలు, మనువరాళ్లు, మునిమనువలు, మునిమననురాళ్లతో కలిసి కుటుంబ సభ్యుల సంఖ్య సుమారు 160 మందికి చేరిందని ఆమె మనువడు షేక్.ఖాదర్ బాబా తెలిపారు. కాగా, సైదాబీ మరణవార్త తెలుసుకున్న వెంటనే బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు.
పాముకాటుతో మహిళ..
పరకాల: పాటు కాటుతో ఓ మహిళ మృతిచెందిన సంఘటన పరకాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొత్త మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని బుడిగజంగాల కాలనీకి చెందిన పస్తం వసంత (44) బోళ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈనెల 3న బోళ్లు అమ్ముకొని వచ్చి అలిసిపోయి సాయంత్రం 5 గంటలకు గుడిసెలో నిద్రిస్తుండగా నాగుపాము కాటువేసింది. దీంతో ఆమె రెండో కుమార్తె స్థానికుల సాయంతో బైక్‌పై పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6.30 గంటలకు మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు
కోతుల దాడిలో
నలుగురికి గాయాలు
స్టేషన్‌ఘన్‌పూర్: రాఘవాపూర్ గ్రామంలో బుధవారం కోతుల వీరంగం సృష్టించాయి. ఈ దాడిలో నలుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. దశరథం, నారాయణరెడ్డి, సాయి, షరీఫ్ తదితరులు తమ ఇళ్ల వద్ద పనులు చేసుకుంటున్నా రు. దీంతో ఒక్కసారిగా గ్రామంలోకి కోతుల గుంపు వచ్చింది. వారించే ప్రయత్నం చేసిన వారిపై ఒక్కసారిగా దాడిచేశాయి. దాంతో చేతులు, కాళ్లకు గాయాలు కాగా బాధితులు స్టేషన్ ఘన్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి టీకాలు వేయించుకున్నారు.
ట్రాక్టర్ల బ్యాటరీల అపహరణ
రాఘవాపూర్‌లో వ్యవసాయ భూముల వద్ద ఉంచిన ట్రాక్టర్ల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బ్యాటరీలు దొంగిలించారు. బాధిత రైతులు మేరుగు మధు, కుక్కల రాజు కథనం ప్రకారం.. రాఘవాపూర్ శివారులోని తమ వ్యవసాయ భూముల వద్ద ట్రాక్టర్లతో పొలం దున్ని మంగళవారం సాయంత్రం రైతులు ఇంటికివచ్చారు. తిరిగి బుధవారం పొలం వద్దకు వెళ్లేసరికి ట్రాక్టర్లకు ఉన్న బ్యాటరీలు లేకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఒక్కో బ్యాటరీ ధర రూ.7వేల వరకు ఉంటుందని తెలిపారు. గతంలోనూ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని, ఈ విషయమై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.


