వరంగల్ అర్బన్: లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న హెచ్చరించారు. బుధవారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎర్రప్రియాంకతో కలిసి కమిషనర్ లక్ష్మీపురం మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మార్కెట్ పరిధిలో ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న ఘన వ్యర్థాలను ఆలస్యం లేకుండా సకాలంలో తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాంపూర్ డంపింగ్ యార్డుకు తరలించడంలో జాప్యం అవుతున్నందున చెత్తను ముందుగా బాలసముద్రం ట్రాన్‌న్స్‌ఫర్ స్టేషన్‌న్‌కు తరలించి అక్కడి నుంచి శాసీ్త్రయ పద్ధతిలో తరలించే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని ప్రధాన మురుగు కాల్వలు, డ్రైనేజీలను నిరంతరం శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నానన్‌వెజ్ మార్కెట్‌ను కమిషనర్ పరిశీలించారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సీహెచ్‌ఓ లక్ష్మారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్‌బాబు పాల్గొన్నారు.
పథకాలను వేగవంతంగా అమలు చేయాలి
మెప్మా ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరా మహిళా శక్తి కేంద్రాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం పోతననగర్‌లో నిర్మించిన ఆధునిక యాంత్రీకృత ధోభీఘాట్‌ను మహిళా సంఘాలు లేదా రజక సంఘాల ద్వారా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాజేశ్వరరావు, ఉప కమిషనర్ సమ్మయ్య, డీఎంసీలు రజితారాణి, రేణుక, పీఎంసీలు రమేశ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
● జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న


