హైదరాబాద్‌–గోరఖ్‌పూర్‌ రైళ్ల సర్వీస్‌ల పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌–గోరఖ్‌పూర్‌ రైళ్ల సర్వీస్‌ల పొడిగింపు

Aug 5 2026 1:53 AM | Updated on Aug 5 2026 1:53 AM

సెప్టెంబర్‌ 4వ తేదీ నుంచి అమలు

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్షన్‌ మీదుగా హైదరాబాద్‌–గోరఖ్‌పూర్‌–హైదరాబాద్‌ మధ్య నడుస్తున్న రైళ్ల సర్వీస్‌లను సెప్టెంబర్‌ 4 నుంచి పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ మంగళవారం తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

సెప్టెంబర్‌ 4,11,18, 25వ తేదీల్లో 4 సర్వీస్‌ల కు గాను హైదరాబాద్‌–గోరఖ్‌పూర్‌ (07075) ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తుంది. సెప్టెంబర్‌ 6, 13, 20, 27 తేదీల్లో 4 సర్వీ స్‌లకు గాను గోరఖ్‌పూర్‌–హైదరాబాద్‌ (0707 6) ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వె ళ్తుంది. ఈ రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే అండ్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌, కాజీపేట జంక్షన్‌, పెద్దపల్లి, మంచిర్యాల, బల్లార్షా, చంద్రాపూర్‌, నాగ్‌పూర్‌లో హాల్టింగ్‌ కల్పించారు.

కామన్‌మెస్‌ బిల్లులను పరిశీలించిన కమిటీ..

నివేదిక రిజిస్ట్రార్‌కు అందజేత

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీలోని కామన్‌ మెస్‌లో బిల్లులు అధికంగా వచ్చాయని, అవకతవకలు చోటుచేసుకోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలతో ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం విఽధితమే. ముఖ్యంగా బీఫార్మసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు తమకు నోడ్యూస్‌ ఇవ్వాలని, సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించిన మెస్‌ బిల్లు తొలుత ఒక్కో విద్యార్థికి రూ. 2,600గా చూపారని, ఆ తర్వాత హాస్టల్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌లోని లెడ్జర్‌లో మాత్రం రూ. 3,100 ఉందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గత హాస్టల్‌ డైరెక్టర్‌ హయాంలో కొన్ని నెలల మెస్‌ బిల్లుల పరిశీలనకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ టి. మనోహర్‌ను చైర్మన్‌గా, ఫార్మసీ కళాశాల డీన్‌ ఎన్‌. ప్రసాద్‌, జూవాలజీ విభాగం ప్రొఫెసర్‌ వై.వెంకయ్య మెంబర్లుగా, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నర్సింహారావు మెంబర్‌ కన్వీనర్‌గా కమిటీని నియమించారు. ఆ కమిటీ ఈనెల 2, 3 తేదీల్లో పలు బిల్లులు పరిశీలించింది. అందులో అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఆ నివేదికను మంగళవారం రిజిస్ట్రార్‌ రామచంద్రంకు సమర్పించింది. అవకతవకలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆ కమిటీ సూ చించినట్లు సమాచారం. కేయూ వీసీ ప్రతాప్‌ రెడ్డి ఈనెల 6న యూనివర్సిటీకి వచ్చే అవకాశం ఉంది. అదే రోజు ఆ రిపోర్టును పరిశీలించే అవకాశాలున్నాయని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది.

కేవీకేను సందర్శించిన

అగ్రికల్చర్‌ విద్యార్థులు

మామునూరు : వరంగల్‌ మామునూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్‌(మధ్యప్రదేశ్‌)కు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థులు సందర్శించారు. ఈసందర్భంగా సాగు విధానం, నూతన సాంకేతిక వ్యవసాయ విధానం, గ్రామీణ వనరులు, సౌకర్యాలను పరిశీలించారు. ఆ తర్వాత గ్రామాన్ని సందర్శించి ప్రధాన వనరులు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ప్రధాన వనరుల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల, గ్రామపంచాయతీ భవనం, పీహెచ్‌సీ, పశువైద్యశాల ఇతర వనరులను మ్యాప్‌ ద్వారా చూపించారు. కృషి విజ్ఞాన కేంద్ర కోఆర్డినేటర్‌ అరుణ్‌జ్యోతి, శాస్త్రవేత్తలు రాజు, గణేశ్‌, సాయి కిరణ్‌, మాజీ కార్పొరేటర్‌ ఈదురు అరుణ విక్టర్‌, గ్రామ పెద్దలు రేగురు లక్ష్మారెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్‌, రేగురి రఘుకుమార్‌రెడ్డి, బండి సాంబయ్య, సల్లూరి రాజు, మధు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement